Nara Lokesh: 'సాక్షి' దొంగరాతలకు ఇదే సాక్ష్యం: నారా లోకేశ్

  • హోదా బోరింగ్ అంశమన్న పీవీపీ
  • వైసీపీ మనసులో మాట బయటకు వచ్చిందన్న లోకేశ్
  • తన వ్యాఖ్యలను వక్రీకరించారంటున్న పీవీపీ
ప్రత్యేక హోదా బోరింగ్ అంశమన్న విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీవీపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ, ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ సెటైర్లు వేశారు. "ప్రత్యేక హోదా బోరు కొట్టిందని వైసీపీ మనసులో మాట బైటికొచ్చింది. అంటే సాక్షిలో రాసేటివి దొంగ రాతలు, జగన్ నోట పలికేవి శుద్ధ అబద్దాలు, వైసీపీ ఎజెండా మొత్తం నీటి మూటలు అని తేలిపోయింది. జగన్ సారూ, కెసిఆర్ సారూ... ఇద్దరిదీ ఒకటే మాట ఏపీకి ప్రత్యేక హోదా వద్దు! అంతేగా!!" అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను ఏం మాట్లాడారో మొత్తం చూసిన తరువాత విమర్శించాలని ఈ ఉదయం పీవీపీ వివరణ ఇచ్చారు.
Nara Lokesh
Twitter
PVP
Special Category Status

More Telugu News