konduru mallikarjuna: కొండూరు మల్లికార్జునను శాంతింపజేసిన బాలయ్య

  • అలకబూనిన లేపాక్షి మాజీ ఎంపీపీ
  • వైసీపీలోకి వెళతారంటూ ప్రచారం
  • రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దిన బాలయ్య
హిందూపురం శాసనసభ నియోజకవర్గంలో కీలకమైన లేపాక్షి మాజీ ఎంపీపీ, టీడీపే నేత కొండూరు మల్లికార్జున పార్టీని వీడుతారన్న వార్తలు కలకలం రేపాయి. పార్టీకి అత్యంత విధేయుడైన మల్లికార్జున వైసీపీలోకి వెళతారన్న సమాచారం టీడీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేసింది. దీంతో, అహుడా ఛైర్మన్ అంబికా లక్ష్మినారాయణ, పార్టీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావులు రంగంలోకి దిగారు.

కొండూరుకు వెళ్లి మల్లికార్జున నివాసంలో చర్చలు జరిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్నా... తనతో పాటు నడిచే నేతలు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, ఆయనను నేరుగా బాలయ్యతో ఫోన్ లో మాట్లాడించారు. మల్లికార్జునను బాలయ్య సముదాయించి, అంతా మంచే జరుగుతుందని హామీ ఇచ్చారు. దీంతో, మనసు మార్చుకున్న మల్లికార్జున... పార్టీ మారే ఆలోచన తనకు లేదని, టీడీపీలో ఉంటానని తెలిపారు.
konduru mallikarjuna
lepakshi
hindupuram
balakrishna
Telugudesam
ysrcp

More Telugu News