chiranjeevi: చిరూ లుక్ ను ఖరారు చేసుకున్న కొరటాల

  •  ముగింపు దశకి చేరుకున్న 'సైరా'
  • కొరటాల సినిమా పనులు వేగవంతం
  •  బరువు తగ్గనున్న చిరూ  

చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' నిర్మితమవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా షూటింగు ముగింపు దశకి చేరుకుంటూ ఉండటంతో, చిరూతో ఆ తరువాత సినిమా చేయనున్న కొరటాల, తన ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వేగవంతం చేశాడు. అందులో భాగంగా రీసెంట్ గా చిరంజీవిపై ఆయన ఫొటో షూట్ ను నిర్వహించినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో రైతుగా .. ఇంతవరకూ చిరంజీవిని ఎవరూ చూపించనంత విభిన్నంగా చూపించాలనే ఉద్దేశంతో కొరటాల ఒక లుక్ ను డిజైన్ చేయించాడట. ఆ లుక్ ను ఖరారు చేసుకుని .. షూటింగు సమయానికి కొంత బరువు తగ్గవలసి ఉంటుందని చిరంజీవికి సూచించినట్టుగా సమాచారం. ఈ సినిమాలో కథానాయికలుగా శ్రుతి హాసన్ .. తమన్నాలను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News