Palakollu: గతంలో నాగబాబు సవాల్ చేశారు, ఇప్పుడు స్వీకరిస్తున్నా: కేఏ పాల్

  • నాగబాబుపై పోటీకి సిద్ధం
  • ప్రజలకు కావల్సింది నటులు కాదు
  • సీట్ల కోసం కొట్టుకోవద్దు
పాలకొల్లు నుంచి జనసేన కీలక నేత నాగబాబు కనుక పోటీకి దిగితే, తాను ఆయనపై పోటీకి సిద్ధమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పేర్కొన్నారు. నేడు ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడుతూ, గతంలో తనను నాగబాబు సవాల్ చేశారని, ఆ సవాల్ ను తాను ఇప్పుడు స్వీకరిస్తున్నానని అన్నారు. ప్రజలకు కావల్సింది అభివృద్ధి అని, నటులు కాదని పేర్కొన్నారు.

అధికారంలోకి వస్తే ఏపీని అమెరికాను మించిపోయేలా తీర్చిదిద్దుతానన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ అపోలో కంటే మెరుగైన ఆసుపత్రులు ప్రారంభిస్తానని తెలిపారు. టీడీపీ, వైసీపీలలో సీట్ల కోసం కొట్టుకోవద్దని, సీటు రాకపోతే బయటకు వచ్చేయాలని సూచించారు. డిల్లీని 15 ఏళ్ల పాటు పాలించిన షీలా దీక్షిత్‌ను కేజ్రీవాల్ రూ.7 లక్షలతో ఓడించారని, తనకైతే రూ.5 లక్షలు చాలని అన్నారు.
Palakollu
Nagababu
Janasena
KA Paul
Prjaa Shanthi
Kejriwal
Sheela Dikshith

More Telugu News