Andhra Pradesh: ఏపీలో వైసీపీ 120-130 సీట్లు గెలవబోతోంది: టీ-మంత్రి తలసాని జోస్యం

  • 23 లోక్ సభ స్థానాల్లోనూ వైసీపీ గెలుస్తుంది
  • చంద్రబాబు చరిత్ర నా దగ్గర ఉంది
  • చంద్రబాబు ఓడిపోయాక చేరుకునేది హైదరాబాద్ కే
ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ 120 నుంచి 130 స్థానాల్లో విజయం సాధించబోతోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అదే విధంగా, 22 నుంచి 23 లోక్ సభ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చరిత్ర తన దగ్గర ఉందని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ బాబు అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు అమరావతికి పారిపోయారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాక చేరుకునేది హైదరాబాద్ లోని ఆయన ఇంటికేనని సెటైర్లు విసిరారు.
Andhra Pradesh
Telangana
Chandrababu
talasani

More Telugu News