gorantla madhav: గోరంట్ల మాధవ్ నామినేషన్ వేసుకోవచ్చు.. రాజీనామాను వెంటనే ఆమోదించండి: ట్రైబ్యునల్ ఆదేశాలు

  • రాజీనామా ఆమోదం పొందకపోవడంతో మాధవ్ కు ఇక్కట్లు 
  • నామినేషన్ స్వీకరించాలంటూ ట్రైబ్యునల్ ఆదేశం
  • ఉత్సాహంలో హిందూపురం వైసీపీ శ్రేణులు

వైసీపీ హిందూపురం లోక్ సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు ఊరట లభించింది. మాధవ్ నామినేషన్ ను స్వీకరించాలని ఎన్నికల సంఘాన్ని ట్రైబ్యునల్ ఆదేశించింది. వీఆర్ఎస్ కోసం మాధవ్ పెట్టుకున్న దరఖాస్తును వెంటనే ఆమోదించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ట్రైబ్యునల్ ఆదేశాలతో హిందూపురం వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. రాజకీయ కారణాలతో వీఆర్ఎస్ ను ఆమోదించకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది.

జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి... సీఐ గోరంట్ల మాధవ్ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 30వ తేదీన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే, ఆయన రాజీనామాను ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో, ఆయన నామినేషన్ ను స్వీకరించకపోవచ్చనే వార్తలు వచ్చాయి. దీంతో, వైసీపీలో టెన్షన్ మొదలైంది. ప్రత్యామ్నాయంగా మరికొన్ని పేర్లను కూడా పార్టీ అధిష్ఠానం పరిశీలించింది. ఈ తరుణంలో ట్రైబ్యునల్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడంతో... సందిగ్ధత తొలగిపోయింది.

More Telugu News