sensex: చివరిలో నష్టాల్లోకి జారుకుని.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్
  • చివరి గంటలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 11 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ఏడు రోజుల ర్యాలీ నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కొంత బ్రేక్ తీసుకున్నాయి. చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో... మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 23 పాయింట్లు లాభపడి 38,387కి పెరిగింది. నిఫ్టీ 11 పాయింట్లు నష్టపోయి 11,521కి పడిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (2.36%), హెచ్డీఎఫ్సీ (1.39%), యస్ బ్యాంక్ (1.27%), ఎల్ అండ్ టీ (1.19%), సన్ ఫార్మా (1.07%).

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-4.29%), ఓఎన్జీసీ (-3.28%), కోల్ ఇండియా (-2.43%), టాటా స్టీల్ (-2.41%), మారుతి సుజుకి (-2.22%).

More Telugu News