Loksatta: జనసేనకు కష్టకాలం అని పవన్ కల్యాణ్ కు ఎప్పుడో చెప్పాను: జయప్రకాష్ నారాయణ

  • జనసేన ప్రభావం ఎంత?
  • ఓట్లను చీల్చి నిలబడగలుగుతుందా?
  • లోక్ సత్తా అధినేత సందేహాలు

మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్సార్సీపీలతో పాటు జనసేన కూడా రేసులో నిలిచింది. అయితే, ఎంతో బలంగా ఉన్న టీడీపీ, వైఎస్సార్సీపీ గెలుపు కోసం ఉరకలు వేస్తున్న తరుణంలో జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ఓట్లను చీల్చి ఏ విధంగా నిలబడగలుగుతుంది? అని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అంటున్నారు. తాను ఇదే విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు కూడా విడమర్చి చెప్పానని వెల్లడించారు. రాష్ట్రంలో పవన్ ప్రభావం గణనీయస్థాయిలో ఉండకపోవచ్చని, మూడో పార్టీగా ఉన్న జనసేనకు కష్టకాలం తప్పదని గతంలోనే హెచ్చరించానని తెలిపారు. ఎన్ని ఓట్లు వస్తాయన్నది ప్రజలే నిర్ణయిస్తారని ఈ మాజీ ఐఏఎస్ అధికారి పేర్కొన్నారు.

More Telugu News