mayavathi: ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు: మాయావతి

  • లోక్ సభకు పోటీ చేయనని ప్రకటించిన మాయావతి
  • యూపీలో ఎస్పీతో కలసి పోటీ
  • ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న మాయావతి
బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. నాలుగు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా మాయావతి వ్యవహరించారు. గత లోక్ సభ ఎన్నికలలో యూపీ నుంచి బీఎస్పీ ఒక్క స్థానం కూడా గెలుపొందలేదు. దీంతో, కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్న ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ఈసారి ఎస్పీతో కలసి బీఎస్పీ ఎన్నికల బరిలోకి దిగింది. మూడో కూటమి అధికారంలోకి వచ్చి, అన్నీ కలసి వస్తే మాయావతి ప్రధాని అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
mayavathi
bsp
lok sabha

More Telugu News