Andhra Pradesh: జనసేనలోకి మెగాబ్రదర్ నాగబాబు.. నరసాపురం లోక్ సభ సీటును కేటాయించిన పవన్ కల్యాణ్!

  • మరికాసేపట్లో నాగబాబు చేరిక
  • ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటన
  • జేడీకి విశాఖ సీటు ఇచ్చిన పవన్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ రాజకీయ చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఈరోజు జనసేనలో చేరుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్ సభ స్థానం నుంచి నాగబాబు పోటీచేస్తారని వెల్లడించింది. ఈ మేరకు జనసేన పార్టీ ట్విట్టర్ లో ఓ ప్రకటన చేసింది.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఇప్పటికే జనసేన విశాఖ లోక్ సభ స్థానాన్ని కేటాయించింది. అలాగే భీమిలి నుంచి పంచకర్ల సందీప్, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం నుంచి తుమ్మల రామస్వామి (బాబు), పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అనంతపురం నుంచి టి.సి. వరుణ్  పోటీలో ఉంటారని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Andhra Pradesh
Jana Sena
Pawan Kalyan
nagababu

More Telugu News