Telugudesam: ఒంటరిగా... టీడీపీ చరిత్రలోనే ఇది తొలిసారి..!

  • ఏ పార్టీతో పొత్తు లేకుండా బరిలోకి దిగిన టీడీపీ
  • పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే తొలిసారి
  • గత ఎన్నికల వరకు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ

ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన చరిత్ర టీడీపీకి లేదని... ప్రతి ఎన్నికలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ గెలిచిందంటూ తెలుగుదేశంపై విపక్ష నేతలు అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముగింపు పలికారు. త్వరలో జరగనున్న ఏపీ శాసనసభ, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఏ పార్టీతో పొత్తు లేకుండా, ఒంటరిగా బరిలోకి దిగింది. చరిత్రలో తొలిసారి సింగిల్ గా పోటీ చేస్తోంది.

ఇప్పటి వరకు టీడీపీ పొత్తు పెట్టుకున్న పార్టీలు ఇవే:
1983 (టీడీపీకి తొలి ఎన్నికలు) - సంజయ్ విచార్ మంచ్ (మేనకాగాంధీ అధ్యక్షురాలు)
1985 - బీజేపీ, వామపక్షాలు
1989 - బీజేపీ, వామపక్షాలు
1994 - వామపక్షాలు
1999 - బీజేపీ
2004 - బీజేపీ
2009 - టీఆర్ఎస్, వామపక్షాలు
2014 - బీజేపీ
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - కాంగ్రెస్, సీపీఐ
2019 - రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా 

More Telugu News