Andhra Pradesh: జగన్ పార్టీ కార్యకర్తలను ఎలా చూసుకుంటారంటే!.. ఆసక్తికర విషయం చెప్పిన వైసీపీ నేత నందిగామ సురేష్!

  • అభ్యర్థుల ప్రకటనకు ముందు ఫోన్ వచ్చింది
  • సభావేదిక వద్దకు 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లాను
  • మీడియాతో బాపట్ల వైసీపీ లోక్ సభ అభ్యర్థి
వైసీపీ అధినేత జగన్ తన అభిమానాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారని బాపట్ల లోక్ సభ అభ్యర్థి నందిగామ సురేష్ తెలిపారు. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించేముందు పులివెందులకు రావాల్సిందిగా జగన్ తనను ఆదేశించారని తెలిపారు.

తాను కారులో 10 నిమిషాలు ఆలస్యంగా సభావేదిక వద్దకు చేరుకున్నానని గుర్తుచేసుకున్నారు. అక్కడకు వెళ్లగానే తనను పక్కన కూర్చోబెట్టుకుని 175 మంది అభ్యర్థుల జాబితా ఇచ్చి చదవమన్నారని చెప్పారు. దీంతో తన కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయన్నారు.

జగన్ పార్టీ శ్రేణులను ఏ విధంగా పట్టించుకుంటారన్న విషయమై మాట్లాడుతూ..‘ఓసారి జగనన్న నాతో 'సురేష్.. నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నావ్ కదా! డబ్బులు ఉన్నాయా? లేకుంటే చెప్పు. మొహమాటపడొద్దు’ అని చెప్పారని గుర్తుచేసుకున్నారు. జగనన్నతో తనకు ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తనపై రెండు కేసులు ఉండేవనీ, వాటిని స్టేషన్ లోనే కొట్టేశారని తెలిపారు.
Andhra Pradesh
YSRCP
Jagan
nandigama suresh
bapatla
Guntur District

More Telugu News