janasena: రాజంపేట జనసేన అభ్యర్థి కుసుమకుమారికి చేదు అనుభవం

  • పార్టీ కార్యాలయానికి వెళ్లిన కుసుమకుమారి
  • వెళ్లిపోవాలంటూ వెంకటరమణ వర్గీయుల ఆగ్రహం
  • కార్యాలయాన్ని బాయ్ కాట్ చేసిన కార్యకర్తలు
జనసేన పార్టీ కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకర్గ అభ్యర్థి ప్రత్తిపాటి కుసుమకుమారికి చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత తొలిసారి ఆమె జనసేన కార్యాలయంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల నుంచి ఆమెకు వ్యతిరేకత ఎదురైంది. ఇక్కడికి రావడానికి మీరెవరంటూ ఆమెను ప్రశ్నించారు. కార్యాలయం నుంచి వెళ్లిపోవాలంటూ వెంకటరమణ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి నచ్చజెప్పేందుకు ఆమె ఎంత ప్రయత్నించినా... వారు శాంతించలేదు. అయినప్పటికీ కార్యాలయం నుంచి ఆమె బయటకు వెళ్లలేదు. దీంతో, కార్యకర్తలు ఆఫీసును బాయ్ కాట్ చేసి బయటకు వెళ్లిపోయారు.
janasena
rajampet
kusumakumari

More Telugu News