vishal: నెగెటివ్ రోల్ చేయడానికి సిద్ధమైన తమన్నా

  • అందాల తారగా తమన్నాకి పేరు
  • యాక్షన్ థ్రిల్లర్ లో నెగెటివ్ రోల్ 
  • ఏప్రిల్ చివరిలో సెట్స్ పైకి    
ఇంతవరకూ తమన్నా అభిమానులు కోరుకున్నట్టుగానే గ్లామరస్ పాత్రలను చేస్తూ వచ్చింది. అయితే పెరుగుతోన్న పోటీ కారణంగా కొంతకాలంగా ఆమె తన రూటు మార్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె హారర్ సినిమాను కూడా చేసేసింది. తాజాగా ఆమె నెగెటివ్ రోల్ చేయడానికి కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది .. అదీ విశాల్ మూవీలో.

గతంలో విశాల్ సరసన 'కత్తి సందై' చేసిన తమన్నా, ఆయన తాజా చిత్రంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేయడానికి సిద్ధమవుతోంది. సుందర్.సి దర్శకత్వం వహించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కథానాయికగా మలయాళ నాయిక ఐశ్వర్య లక్ష్మి కనిపించనుందని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, ఏప్రిల్ చివరివారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. తమన్నా ఇంతవరకూ చేయని పాత్రను చేస్తుండటం .. ఈ సినిమాపై ఆసక్తిని పెంచే ప్రధానాంశం అవుతుందని చెప్పొచ్చు. 
vishal
thamannah

More Telugu News