NTR: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నుంచి బాలూ పాడిన 'విజయం..' పాట!

  • మరో సాంగ్ ప్రోమో విడుదల
  • 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ విజయం నేపథ్యంలో పాట
  • పాటలో ఎన్టీఆర్ డైలాగ్ కూడా

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నుంచి మరో పాట ప్రోమో విడుదలైంది. ఈ ఉదయం వర్మ 'విజయం విజయం ఘన విజయం... విజయం విజయం శుభసమయం... జయహో నాదం.. ఎదలో మోదం.. వదనాల వెలిగే హాసం... గుండెల్లో లోలోపల ఆనందం...' అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను విడుదల చేశారు. ఈ పాట 1994 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి, ఎన్టీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించే క్రమంలో వస్తుందని తెలుస్తోంది. ఇదే పాటలో "నీలాంటి వ్యక్తిని పట్టుకుని ఎన్ని నిందలు మోపారు. వాళ్లందరికీ ఈ ఘనవిజయం ఓ గొప్ప చెంపదెబ్బ" అన్న ఎన్టీఆర్ డైలాగ్ కూడా వినిపిస్తోంది.


  • Loading...

More Telugu News