Pawan Kalyan: నారా లోకేశ్‌పై అభ్యర్థిని నిలబెట్టని జనసేన.. సీపీఐకి కేటాయించడంపై తీవ్ర విమర్శలు!

  • మంగళగిరి సీటును సీపీఐకి కేటాయించిన జనసేన
  • టీడీపీ నుంచి ప్యాకేజీ తీసుకున్నారంటూ పవన్‌పై వైసీపీ ఆరోపణ
  • మంగళగిరి సీటును నాలుగుసార్లు కైవసం చేసుకున్న కమ్యూనిస్టులు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మంగళగిరిపైనే పడింది. మంత్రి నారా లోకేశ్ ఇక్కడి నుంచి అసెంబ్లీ బరిలోకి దిగడమే ఇందుకు కారణం. ‘సర్పంచ్‌గా కూడా గెలవలేని లోకేశ్‌’ అంటూ పలుమార్లు విరుచుకుపడిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇప్పుడు లోక్‌శ్‌పై తమ అభ్యర్థిని నిలబెట్టకుండా సీపీఐకి కేటాయించడం సర్వత్ర చర్చనీయాంశమైంది.

లోకేశ్‌ను ఏకపక్షంగా గెలిపించేందుకే పవన్ అక్కడ తమ అభ్యర్థిని నిలపలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి పవన్ ప్యాకేజీ తీసుకోవడం వల్లే అక్కడ తమ అభ్యర్థిని నిలపలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రత్యర్థుల విమర్శలు ఎలా ఉన్నా పవన్ మాత్రం వ్యూహాత్మకంగానే ఈ సీటును సీపీఐకి కేటాయించారని తెలుస్తోంది.

ఇక్కడి నుంచి నాలుగుసార్లు కమ్యూనిస్టులు గెలుపొందగా, ఆరుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు టీడీపీ, ఒకసారి జనతాపార్టీ గెలిచాయి. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఈ సీటును సీపీఐకి కేటాయించినట్టు తెలుస్తోంది.

More Telugu News