owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలు ఇవే

  • స్థిరచరాస్తుల విలువ రూ. 17.84 కోట్లు
  • రూ. 12.05 కోట్ల అప్పులు
  • ఐదు పెండింగ్ క్రిమినల్ కేసులు  
హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిన్న నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన స్థిరచరాస్తులు, క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్లో ఆయన చూపించారు. రూ. 17.84 కోట్ల ఆస్తులు తన కుటుంబానికి ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం తన చేతిలో రూ. 2 లక్షలు ఉన్నాయని తెలిపారు. రూ. 2 లక్షల విలువైన తుపాకులు ఉన్నాయని పేర్కొన్నారు. ఐదు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. అయితే, తన వద్ద సొంత వాహనం ఒకటి కూడా ఉన్నట్టు ఒవైసీ చూపించలేదు.  

2014 ఎన్నికల సమయంలో రూ. 3.94 కోట్లుగా ఉన్న ఒవైసీ కుటుంబ ఆస్తుల విలువ దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. ఇదే సమయంలో గతంలో పోల్చితే అప్పులు రూ. 1.4 కోట్ల నుంచి రూ. 12.05 కోట్లకు పెరిగాయి.
owaisi
assets
affidavit
mim

More Telugu News