పోలవరం వైఎస్ఆర్ దే... పూర్తి చేసేది నేనే: వైఎస్ జగన్

- ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్
- చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు
- బాబు కథలు విని మోసపోవద్దు
- కొయ్యలగూడెంలో వైఎస్ జగన్
చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయని, ప్రజలకు రేషన్ కార్డుల నుంచి పెన్షన్ల వరకూ ప్రతి పనికీ జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాల్సిన దుస్థితిలో ప్రజలు ఉన్నారని, ఈ ఇబ్బందులన్నీ తాను విన్నానని, ప్రజల సమస్యలు తాను చూశానని, వారికి సంక్షేమ పాలనను అందించేందుకు తానున్నానని భరోసాను ఇచ్చారు. గ్రామాల్లో ఉన్న 50 శాతం అక్క చెల్లెమ్మల కష్టాలు తనకు తెలుసునని, వారందరి సమస్యలనూ తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణాల మాఫీ అవాస్తవమని వైఎస్ జగన్ ఆరోపించారు. రుణ మాఫీ జరుగకుండానే సిగ్గులేకుండా, వాటిని మాఫీ చేశానని చెబుతూ శాలువాలు కప్పించుకున్న ఘనత ఆయనదేనని అన్నారు.
ఎన్నికలకు మూడు నెలల ముందు వచ్చి ఆయన చెక్కులు ఇస్తున్నారని, ఆ మొత్తం కలిపినా రూ. 6 వేల కోట్లు దాటలేదని, అవి కూడా బ్యాంకుల్లో మారడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. అక్కచెల్లెమ్మలు పడిన బాధలు తనకు తెలుసునని, వారికి ఓ అన్నగా అండగా నిలుస్తానని అన్నారు. వైకాపా ప్రభుత్వం రాగానే అప్పుల పాలైన అక్కచెల్లెమ్మల కష్టాలన్నింటినీ తాను తీరుస్తానని భరోసా ఇచ్చారు. వచ్చే నాలుగేళ్లలో సంవత్సరానికి రూ. 12,500 చొప్పున రూ. 50 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు.