Congress: రెండు వారాలైనా సబిత ఇంకా టీఆర్ఎస్‌లో చేరరే.. మనమే సాగనంపుదాం: కొండా విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా

  • అలా మోసపోయిన వారిలో నేనూ ఒకడిని
  • ఈ ఎన్నికల్లో ప్రజలు మోసపోరు
  • ముఖ్యకార్యకర్తల సమావేశంలో కొండా విశ్వేశ్వరరెడ్డి
టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు కేసీఆర్, కేటీఆర్, అసదుద్దీన్ ఒవైసీలతో వరుస భేటీలు నిర్వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి రెండు వారాలైనా పార్టీని వీడడం లేదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. మనమంతా వెళ్లి ఆమెను సాగనంపుదామంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. వికారాబాద్ జిల్లా ధరూరులో సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విశ్వేశ్వరరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ వస్తే ప్రతి ఇంటికీ ఉద్యోగం వస్తుందని నమ్మిన వారిలో తానొకడినని, అందరిలానే తానూ మోసపోయానని ఎంపీ పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు ఇవ్వకుంటే ఓట్లే అడగనన్న కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చినా నీళ్లు రావడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌ను నమ్మి ఓట్లేసిన ప్రజలు.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మోసపోరన్నారు.  టీఆర్ఎస్‌లో చేరుతున్నానంటూ హడావుడి చేసిన సబితా రెడ్డి ఇప్పటి వరకు ఇంకా కాంగ్రెస్‌ను వీడడం లేదని విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు.
Congress
TRS
Konda vishweshwara reddy
Sabita Indra reddy
Chevella
Vikarabad District

More Telugu News