Andhra Pradesh: మిగిలిన 36 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. టీడీపీ జాబితా పూర్తి

  • సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దక్కని స్థానాలు
  • నర్సాపురం లోక్‌సభ స్థానానికి మారిన వేటుకూరి వెంకట శివరామరాజు
  • భూమా కుటుంబం నుంచి ఇద్దరికి చోటు

టీడీపీ అభ్యర్థుల జాబితా పూర్తయింది. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు మొత్తం అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి దాటాక మిగిలిన 36 శాసనసభ స్థానాలతోపాటు 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. లోక్‌సభ స్థానాలకు ఎంపిక చేసిన అభ్యర్థులను బట్టి అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో చిన్నచిన్న మార్పులు చేసింది. విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యే  మీసాల గీత, శింగనమల ఎమ్మెల్యే యామినీబాల, కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, కర్నూలు ఎమ్మెల్యే  ఎస్వీ మోహన్‌రెడ్డిలకు టికెట్లు కేటాయించలేదు. వారి స్థానంలో వేరే వారికి కేటాయించారు.

ఇక, తొలి జాబితాలో ఉండి అసెంబ్లీ స్థానానికి ప్రకటించిన వేటుకూరి వెంకట శివరామరాజును నర్సాపురం లోక్‌సభ స్థానానికి మార్చింది. ఆళ్లగడ్డ నుంచి మంత్రి అఖిలప్రియ, నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలకు సీట్లు దక్కాయి. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీ అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి బరిలోకి దిగుతున్నారు. టీడీపీ విడుదల చేసిన తుది జాబితా ప్రకారం..

లోక్‌సభ అభ్యర్థులు:  రామ్మోహన్‌ నాయుడు (శ్రీకాకుళం), అశోక్‌ గజపతిరాజు (విజయనగరం), కిషోర్‌ చంద్రదేవ్‌ (అరకు), భరత్‌ (విశాఖ), ఆడారి ఆనంద్‌ (అనకాపల్లి), చలమలశెట్టి సునీల్‌ (కాకినాడ), గంటి హరీష్‌ (అమలాపురం), మాగంటి రూప (రాజమండ్రి), వేటుకూరి వెంకట శివరామరాజు (నర్సాపురం), మాగంటి బాబు(ఏలూరు), కేశినేని నాని (విజయవాడ), కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం), గల్లా జయదేవ్‌ (గుంటూరు), రాయపాటి సాంబశివరావు (నర్సరావుపేట), శ్రీరాం మాల్యాద్రి (బాపట్ల), శిద్ధా రాఘవరావు (ఒంగోలు), బీదా మస్తాన్‌రావు (నెల్లూరు), ఆది నారాయణరెడ్డి (కడప), నిమ్మల కిష్టప్ప (హిందూపురం), జేసీ పవన్‌రెడ్డి (అనంతపురం), మాండ్ర శివానంద్‌రెడ్డి (నంద్యాల), కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి (కర్నూలు), డీకే సత్యప్రభ (రాజంపేట), పనబాక లక్ష్మి (తిరుపతి), శివప్రసాద్‌ (చిత్తూరు)

శాసనసభ అభ్యర్థులు:  పతివాడ నారాయణస్వామినాయుడు (నెల్లిమర్ల), అదితి గజపతిరాజు (విజయనగరం), సబ్బం హరి (భీమిలి), పల్లా శ్రీనివాసరావు (గాజువాక), కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు (చోడవరం), గవిరెడ్డి రామానాయుడు (మాడుగల), బండారు సత్యనారాయణ మూర్తి (పెందుర్తి), అయితాబత్తుల ఆనందరావు (అమలాపురం), బూరుగుపల్లి శేషారావు (నిడదవోలు), బండారు మాధవనాయుడు (నర్సాపురం), బొరగం శ్రీనివాసరావు (పోలవరం),

తెనాలి శ్రావణ్‌కుమార్‌ (తాడికొండ), అన్నం సతీష్‌ ప్రభాకర్‌ (బాపట్ల), డాక్టర్‌ అరవింద్‌ బాబు (నరసరావుపేట), అంజిరెడ్డి (మాచర్ల), కదిరి బాబురావు (దర్శి), ముక్కు ఉగ్రనరసింహారెడ్డి (కనిగిరి), విష్ణువర్ధన్‌రెడ్డి (కావలి), అబ్దుల్‌ అజీజ్‌ (నెల్లూరు రూరల్), కె.రామకృష్ణ (వెంకటగిరి), బొల్లినేని రామారావు (ఉదయగిరి), అమీర్‌బాబు (కడప), నర్సింహ ప్రసాద్‌ (రైల్వేకోడూరు), లింగారెడ్డి (ప్రొద్దుటూరు),

టీజీ భరత్‌ (కర్నూలు), భూమా బ్రహ్మానందరెడ్డి ( నంద్యాల), బి.రామాంజనేయులు (కోడుమూరు), ఆర్‌.జితేంద్రగౌడ్‌ ( గుంతకల్లు), బండారు శ్రావణి (శింగనమల), ప్రభాకర్‌ చౌదరి (అనంతపురం అర్బన్‌), ఉమామహేశ్వరనాయుడు (కల్యాణదుర్గం), కందికుంట వెంకటప్రసాద్‌ (కదిరి), శంకర్‌ యాదవ్‌ (తంబళ్లపల్లె), జేడీ రాజశేఖర్‌ (సత్యవేడు), హరికృష్ణ (గంగాధరనెల్లూరు), తెర్లాం పూర్ణం (పూతలపట్టు)

More Telugu News