t-congress: పార్టీ ఫిరాయింపుదారులపై వేటు.. టీ-కాంగ్రెస్ నుంచి ఆరుగురు బహిష్కరణ!

  • కాంగ్రెస్ వీడిన నేతలపై అధిష్ఠానం సీరియస్
  • ఆరేపల్లి , సోయం, పటోళ్ల పై బహిష్కరణ వేటు
  • రమ్యారావు, క్రిశాంక్, నరేష్ జాదవ్ ల పైనా కూడా
పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ టీ-కాంగ్రెస్ నేతలపై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు నేతలను బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. ఆరేపల్లి మోహన్, సోయం బాపూరావు, పటోళ్ల కార్తీక్ రెడ్డి, రమ్యారావు, క్రిశాంక్, నరేష్ జాదవ్ లను పార్టీ బహిష్కరించినట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీ ని వీడి టీఆర్ఎస్ లో ఆయా నేతలు చేరడాన్ని అధిష్ఠానం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.  
t-congress
arepalli
mohan
soyam
bapurao
patolla
karthik reddy
ramya rao
krishank

More Telugu News