cuddapah: ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతారు: వైఎస్ జగన్ ఫైర్

  • హత్యలు చేయించడానికైనా వెనుకాడరు
  • వైఎస్ వివేకాను హత్య చేయించారు
  • హత్యలు చేయించి.. అధర్మంగా వార్తలు రాయిస్తారు
త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారతారని వైసీపీ అధినేత జగన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. కడప జిల్లా రాయచోటిలో ఏర్పాటు చేసిన వైసీపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో విజయం కోసం చంద్రబాబు ఎంతటి నీచానికి దిగజారారంటే.. హత్యలు చేయించడానికైనా వెనుకాడరని, వైఎస్ వివేకాను హత్య చేయించారని ఆరోపించారు.

‘హత్యలు చేయించేది వారే, పేపర్లలో అధర్మంగా వార్తలు రాయించేది వారే’ అంటూ జగన్ విరుచుకుపడ్డారు. గ్రామాల్లోకి అవినీతి డబ్బు మూటలను పంపిస్తారని, డబ్బిచ్చే ఓట్లు కొనుగోలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోవద్దని, కొంచెం ఓపిక పడితే వైసీపీ ప్రభుత్వం వస్తుందని భరోసా ఇచ్చారు. 
cuddapah
rayachoti
YSRCP
jagan
campaign

More Telugu News