chaitu: మా వైవాహిక జీవితానికీ .. 'మజిలీ' సినిమాకి ఎలాంటి సంబంధం లేదు: సమంత

  • 'మజిలీ' కథాకథనాలు వేరు 
  • కొత్తదనం కారణంగా ఈ సినిమా చేశాము
  •  కుటుంబ సమేతంగా చూడొచ్చు    

నాగచైతన్య కథానాయకుడిగా .. సమంత నాయికగా శివ నిర్వాణ దర్శకత్వంలో, 'మజిలీ' సినిమా నిర్మితమైంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చైతూ - సమంత భార్యాభర్తలుగానే కనిపించనున్నారు. అందువలన "నిజ జీవితానికీ .. ఈ కథకి మధ్య ఏ విషయంలోనైనా పోలికలు ఉన్నాయా? సంఘటనలు .. సన్నివేశాలు కలిసిన సందర్భాలేమైనా ఉన్నాయా?" అనే ప్రశ్నలు తాజా ఇంటర్వ్యూలో సమంతకి ఎదురయ్యాయి.

అప్పుడు ఆమె స్పందిస్తూ .. 'మజిలీ' సినిమాకి .. మా నిజ జీవితానికి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఆ సినిమాలోని పాత్రలకు .. మాకు మధ్య ఎలాంటి పోలికలు వుండవు. ముఖ్యంగా 'మజిలీ'లో చైతూ పాత్రకు .. ఆయన రియల్ క్యారెక్టర్ కి అసలు సంబంధమే ఉండదు. కథలోని కొత్తదనం కారణంగానే మేమిద్దరం ఈ సినిమాను చేశాము. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడొచ్చు" అని ఆమె చెప్పుకొచ్చారు.

More Telugu News