Vijayasai Reddy: అక్కడ చేరితే ఛీకొడతారని ఇక్కడ చేరారు: లక్ష్మీనారాయణపై విజయసాయిరెడ్డి

  • మీరు మొదటి నుంచి చంద్రబాబు మనిషేగా
  • ఇప్పుడు టీడీపీ అనుబంధ సంస్థలో చేరారు
  • ఇన్నాళ్లూ ఎవరి కోసం పనిచేశారో ప్రజలకు తెలుసన్న విజయసాయి
ఆదివారం నాడు జనసేన పార్టీలో చేరిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను లక్ష్యంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మినారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేసారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?" అని వ్యాఖ్యానించారు. ఆపై "35 ఏళ్లుగా చంద్రబాబు పులివెందుల అబ్సెషన్ తో బాధపడుతున్నారు. 14 సంవత్సరాలు సిఎంగా ఉండి కూడా ఈ ఫోబియాల నుంచి బయట పడలేక పోయారేమిటి తుప్పు నాయుడు గారూ? అర్థంలేని భయాలను ప్రజలకు అంటించాలని చూస్తున్నారు. మంచి డాక్టర్ ను కలవండి  ట్రీట్మెంట్ ఇస్తాడు" అని సెటైర్ వేశారు.





Vijayasai Reddy
Lakshminarayana
Jana Sena

More Telugu News