tirumala: తిరుమలలో సర్వర్ల మొరాయింపు... తీవ్ర ఇబ్బందులు!

  • నిలిచిన పలురకాల సేవలు
  • సాంకేతిక సమస్యలే కారణమన్న అధికారులు
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో గదుల కేటాయింపు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఈ ఉదయం సర్వర్లు మొరాయించాయి. దీంతో టైమ్ స్లాట్ టోకెన్ ల జారీ నుంచి అద్దె గదుల కేటాయింపు వరకూ పలు సేవలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్లు నిలిచిపోయాయని, సమస్యను పరిష్కరించేందుకు ఐటీ టీమ్ కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అద్దె గదులను కేటాయిస్తున్నామని, భక్తులు సహకరించాలని జేఈఓ కోరారు.
tirumala
Servers
Timeslot

More Telugu News