somireddy: సోమిరెడ్డే నన్ను టీడీపీకి దూరం చేశారు: వైసీపీ నేత ఆదాల

  • సోమిరెడ్డి నాపై చంద్రబాబుకు చాడీలు చెప్పారు
  • నెల్లూరు రూరల్ లో వెన్నుపోట్లు మొదలయ్యాయి
  • ఈ విషయాన్ని బాబుకు చెప్పే అవకాశం నాకు దొరకలేదు
నెల్లూరు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై  వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సోమిరెడ్డి తనపై చంద్రబాబుకు చాడీలు చెప్పి, తనను పార్టీకి దూరం చేశారని ఆరోపించారు. నెల్లూరు రూరల్ లో సోమిరెడ్డి వెన్నుపోట్లు మొదలుపెట్టారని, ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్దామంటే వీలు కల్పించలేదని అన్నారు. తాను ఇచ్చిన డబ్బులతో కట్టిన టీడీపీ ఆఫీసులో కూర్చుని తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో తనకు భూములు లేవని, తనను ఎవరూ బెదిరించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
somireddy
Telugudesam
YSRCP
aadala
nellore

More Telugu News