వైఎస్ వివేకాను హత్య చేయించింది ఆదినారాయణరెడ్డే: రోజా నిప్పులు!

17-03-2019 Sun 12:06
  • ఓడిపోతామన్న భయంతో హత్య
  • సీబీఐ విచారణకు భయమెందుకు?
  • జగన్ ను ఇబ్బంది పెట్టాలని కుట్రలన్న రోజా

నాడు పరిటాల రవి హత్య జరిగిన సమయంలో సీబీఐ విచారణ జరిపించాలంటూ గొంతెత్తుకు అరిచిన నారా చంద్రబాబునాయుడు, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనక అసలు దోషులు బయటకు వచ్చేలా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ఆర్కే రోజా ప్రశ్నించారు.

ఈ ఉదయం తిరుమలలో మీడియాతో మాట్లాడిన రోజా, వైఎస్ వివేకా ఉంటే ఓడిపోతామన్న భయంతోనే తెలుగుదేశం నేత ఆదినారాయణరెడ్డి హత్య చేయించారని ఆరోపించారు. సీబీఐతో విచారణ జరిపిస్తే, ఆయన ప్రమేయం వెలుగులోకి వస్తుందని అన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని టీడీపీ నేతలు కుట్ర పన్నారని నిప్పులు చెరిగారు.