Jagan: బీసీలకు పెద్దపీట వేశాం: వైఎస్ జగన్

  • బీసీలకు 7 సీట్లు ఇచ్చాం
  • లోక్ సభ అభ్యర్థుల జాబితా తరువాత జగన్
  • వైఎస్ఆర్ కు ఘననివాళులతో ప్రచారానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్ సభ స్థానాలకుగాను పెండింగ్ లో ఉన్న 16 సీట్లకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, తమ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని తెలిపారు. మొత్తం నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయిన 5 సెగ్మెంట్లనూ పక్కనపెడితే, మిగిలిన 20 స్థానాల్లో ఏడింటిని బీసీలకు ఇచ్చామని తెలిపారు. అంతకుముందు ఆయన తన చేతుల్లో జాబితాను పట్టుకుని నడుస్తూ వచ్చి, తన తండ్రి సమాధిని పూలమాలతో అలంకరించి, నివాళులు అర్పించారు. ఆయనతో పాటు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, రామచంద్రయ్య, ధర్మాన ప్రసాదరావు తదితరులు ఉన్నారు.
Jagan
YSRCP
BC
Lok Sabha

More Telugu News