USA: వందల కోట్ల మందిలో ఒకరికి... 9 నిమిషాల్లో ఆరుగురు కవలలు!

  • అమెరికాలోని టెక్సాస్ లో ఘటన
  • డెలివరీ చేసిన వైద్యులు
  • నలుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు
ఇది నిజంగా అద్భుతమే. వందల కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుంది. కేవలం తొమ్మిదంటే తొమ్మిది నిమిషాల వ్యవధిలో ఓ మహిళ ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చి సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. టెల్మ చియాక్ అనే యువతి గర్భం దాల్చగా, ఆమె కడుపులో ఆరుగురు శిశువులు ఉన్నారని వైద్యులు గుర్తించారు. ఆపై ఆమెను తొమ్మిది నెలల పాటు జాగ్రత్తగా చూసి, డెలివరీ చేశారు. తాజాగా ఆమె నలుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలను ప్రసవించగా, ఇది చాలా అరుదైన ఘటన అని వైద్యులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తల్లితో పాటు బిడ్డలంతా ఆరోగ్యంగా ఉన్నారని, వారి బరువు 790 గ్రాముల నుంచి 1.3 కిలోల వరకూ ఉందని చెప్పారు.
USA
Texas
Delivary

More Telugu News