Pawan Kalyan: రాత్రి ఒంటిగంటకు పవన్ ను కలిసిన లక్ష్మీనారాయణ... గంటలోపే నిర్ణయం!

  • పవన్ ఇంటికి వచ్చిన లక్ష్మీనారాయణ
  • 45 నిమిషాల పాటు చర్చలు
  • నేడు జనసేనలో చేరిక
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన అధికారి లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరడం ఖరారైంది. శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో పవన్ ఇంటికి వచ్చిన లక్ష్మీనారాయణ, సుమారు 45 నిమిషాలకు పైగా పవన్ తో చర్చలు సాగించారు. ఆపై ఆదివారం ఉదయం తాను జనసేనలో చేరనున్నట్టు లక్ష్మీ నారాయణ ప్రకటించారు. ఆయనతో పాటు ఎస్కేయూ మాజీ ఉప కులపతి శ్రీరాజగోపాల్ కూడా జనసేనలో చేరనున్నారు. లక్ష్మీ నారాయణ వంటి నేత జనసేనలో చేరడం ఎంతో గౌరవమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయన పార్టీలో చేరికను ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
Pawan Kalyan
Lakshminarayana
Jana Sena

More Telugu News