Pawan Kalyan: ఏపీలో పవన్ కల్యాణ్ ఒక్కడే కనిపిస్తున్నాడు: విజయశాంతి

  • ఏపీ ప్రజలకు పవనే సరైన నేత
  • చిత్తశుద్ధిని నిరూపించుకున్నాడు
  • విజయశాంతి ప్రశంసలు
తెలుగు నటి, కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి జనసేనాని పవన్ కల్యాణ్ పై ప్రశంసల జల్లు కురిపించింది. కేసీఆర్ వలలో చిక్కుకోకుండా పవన్ కల్యాణ్ ఎంతో విజ్ఞత చూపించాడని కొనియాడారు. రాజమండ్రిలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కోట్లాదిమంది ఆంధ్రుల హృదయవేదనగా భావిస్తున్నానని తెలిపారు.

బీజేపీకి బినామీగా మారి ఏపీలో అడుగుపెట్టాలని చూస్తున్న కేసీఆర్ ను సీమాంధ్రులు ఎప్పటికీ అంగీకరించరని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు కేసీఆర్ కు సీమాంధ్రలో సరైన ప్రత్యర్థి లేరని చెప్పుకునేవాళ్లని, కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ రూపంలో సరైనోడు వచ్చాడని విజయశాంతి కితాబిచ్చారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలను, నియంత ధోరణులను ప్రశ్నించడం ద్వారా తానేంటో నిరూపించుకున్నాడని పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ జోక్యం ఏంటని పవన్ నిలదీసిన వైనం ప్రతి ఒక్క ఆంధ్రుడి గుండెచప్పుడుగా భావించాలని విజయశాంతి అభిప్రాయపడ్డారు.
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
KCR

More Telugu News