YSRCP: ఈ నెల 31 లోగా కొత్త ఓటర్లందరికీ ఓటరు కార్డులు పంపిణీ!: ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది

  • రాయలసీమలో శాంతిభద్రతల అంశంపై సీఈవో సమీక్ష
  • కడప జిల్లా ఎస్పీతో మాట్లాడిన ద్వివేది
  • శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని ఆదేశాలు
రాయలసీమలో శాంతిభద్రతల అంశంపై ఆయా జిల్లాల ఎస్పీలతో ఏపీ ఎన్నికల సంఘం సీఈవో గోపాలకృష్ణ ద్వివేది సమీక్షించారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని ఈ మేరకు ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోమని చెప్పినట్టు సమాచారం.  

ఓటరు నమోదు ప్రక్రియ ముగిసింది

ఈ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ ముగిసిందని, నిన్న ఒక్కరోజే 5 లక్షల ఫారం-6 దరఖాస్తులు వచ్చినట్టు ద్వివేది తెలిపారు. నవంబరు 1 తర్వాత 37.28 లక్షల ఫారం-6 దరఖాస్తులు వచ్చాయని, ఇంకా 11 లక్షల దరఖాస్తులు పరిశీలించాల్సి ఉందని అన్నారు. పత్రాలు సరిగా లేవని 3 లక్షల ఫారం-6 దరఖాస్తులు తిరస్కరించినట్టు చెప్పారు. ఈ నెల 25 లోగా పరిశీలన పూర్తి చేసి ఓటరు కార్డులు జారీ చేస్తామని, కొత్తగా 22.49 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని అన్నారు. ఈ నెల 26న అనుబంధ ఓటర్ల జాబితా ప్రకటిస్తామని అన్నారు.

ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన

ఈ నెల 31 లోగా కొత్త ఓటర్లందరికీ ఓటరు కార్డులు పంపిణీ చేస్తామని వివరించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన కల్పిస్తామని, ఎన్నికల విధుల్లో ఉన్న 4 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వాడుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ నెల 1 నుంచి 15 వరకూ రూ.5.44 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశామని, రూ.18 లక్షల విలువైన వివిధ రకాల మత్తు పదార్థాలు పట్టుకున్నామని, మద్యం స్వాధీనం సందర్భంగా 2,077 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
YSRCP
vivekananda reddy
EC
gk dwivedi

More Telugu News