ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్న ‘మజిలీ’
- చైతు, సమంత జంటగా ‘మజిలీ’
- రెండో కథానాయికగా దివ్యాన్షా కౌషిక్
- ఏప్రిల్ 5న విడుదల
ఇప్పటికే విడుదలైన టీజర్ కోటికి పైగా వ్యూస్‌ను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 5న ‘మజిలీ’ విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలకు పెద్దగా సమయం లేకపోవడంతో ఇక నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నామని చిత్రబృందం వెల్లడించింది.