nani: పూర్తిస్థాయి విలన్ గా కనిపించనున్న నాని!

  • విక్రమ్ కుమార్ తో సెట్స్ పై నాని 
  • తదుపరి సినిమా ఇంద్రగంటితో 
  • కీలకమైన పాత్రలో సుధీర్ బాబు    

నాని కథానాయకుడిగా చేసిన 'జెర్సీ' ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతోంది. ఈ సినిమా తరువాత నాని .. విక్రమ్ కుమార్ తో కలిసి 'గ్యాంగ్ లీడర్' చేస్తున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టును కూడా నాని లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాకి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాలో నాని పూర్తిస్థాయి విలన్ గా కనిపించనున్నాడని అంటున్నారు.  

ఇక సుధీర్ బాబు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. నాని జోడీగా అదితీరావును తీసుకున్నారు. సుధీర్ బాబు సరసన నివేదా థామస్ ను అనుకున్నారుగానీ, పారితోషికం విషయంలో తేడా రావడంతో, మరో కథానాయికను ఎంపిక చేసుకునే పనిలో వున్నారు. ఇంద్రగంటి - నాని కాంబినేషన్లో గతంలో 'జెంటిల్ మేన్' వంటి హిట్ రావడం వలన, తాజా చిత్రంపై అందరిలోనూ ఆసక్తి వుంది.

More Telugu News