'చిత్రలహరి' టీమ్ కి ధన్యవాదాలు తెలిపిన సాయిధరమ్ తేజ్
- మెగా హీరో నుంచి 'చిత్రలహరి'
- షూటింగు పార్టు పూర్తి
- ఏప్రిల్ 12వ తేదీన విడుదల
ఇదే విషయాన్ని సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా చేయడం ఓ మరిచిపోలేని అనుభవమని అన్నాడు. దర్శకుడు కిషోర్ తిరుమల టీమ్ కి .. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ టీమ్ కి.. సినిమాటోగ్రఫర్ కార్తీక్ టీమ్ కి ఆయన ధన్యవాదాలు తెలియజేశాడు. షూటింగు అయిపోయిన సందర్భంగా ఈ సినిమా టీమ్ తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది