madan: దేవుడు లేడని కొట్టిపడేసే శక్తి నాకు లేదు: దర్శకుడు మదన్

  • అతీతమైన శక్తి ఉందంటారు కొందరు
  • ఆ శక్తికి ఆదర్శమనేది లేదంటారు మరికొందరు
  •  స్థిరమైన అభిప్రాయమనేది దాదాపుగా ఉండదు  

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూ లో దర్శకుడు మదన్ మాట్లాడుతూ .. దేవుడి గురించి తన మనసులోని మాటను బయటపెట్టారు. "దేవుడు లేడని కొట్టిపారేసే శక్తి నాకు లేదు. ఉన్నాడని ఒప్పుకోవడానికి నాకు గల లాజిక్ పవర్ ఒప్పుకోదు. భగవంతుడనే వాడు ఉన్నాడు .. ఆయన మన మంచి చెడ్డలను గమనిస్తూ ఉంటాడు .. నువ్వు మంచి చేస్తే నీకు మంచే జరుగుతుంది వంటి ఆలోచనా విధానాన్ని నేను నమ్మలేను.

మనందరినీ నడిపించే అతీతమైన శక్తి ఒకటుందని కొంతమంది చెబుతుండగా నేను విన్నాను. ఆ అతీతమైన శక్తికి ఒక ఆదర్శం ఉందని నేను అనుకోవడం లేదు. కొన్నిచోట్ల జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలిసినప్పుడు నాకు ఇలా అనిపిస్తూ ఉంటుంది. అతీతమైన ఆ శక్తికి ఆదర్శం ఉందని కొంతమంది అంటారు .. లేదని మరికొందరు అంటారు. ఏ విషయంలోనైనా ఎవరికీ ఒక స్థిరమైన అభిప్రాయం మాత్రం ఉండదు. మనుషులనేవాళ్లు మారుతూ వెళుతుంటారనేది నా అభిప్రాయం" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News