new zealand: దేశ చరిత్రలో ఇది చీకటి రోజు: న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్

  • క్రైస్ట్ చర్చ్ లో మసీదులపై దుండగుల కాల్పులు
  • శుక్రవారం కావడంతో మసీదులకు భారీ సంఖ్యలో వచ్చిన ముస్లింలు
  • పలువురు ప్రాణాలు కోల్పోవడంపై న్యూజిలాండ్ ప్రధాని ఆవేదన

న్యూజిలాండ్ లోని ప్రముఖ నగరాల్లో ఒకటైన క్రైస్ట్ చర్చ్ లో రెండు మసీదులపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ మాట్లాడుతూ, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఇదొక చీకటి రోజు అని ఆమె అన్నారు.

శుక్రవారం కావడంతో... ప్రార్థనల కోసం ముస్లింలు మసీదుల వద్దకు భారీ సంఖ్యలో వచ్చారు. మధ్యాహ్న ప్రార్థనల సందర్భంగా, ఓ మసీదు వద్దకు బంగ్లాదేశ్ క్రికెటర్లు వచ్చిన సమయంలో ఓ షూటర్ కాల్పులను ప్రారంభించాడు. అయితే వీరంతా అక్కడి నుంచి పరుగెత్తి, ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ కాల్పుల ఘటనతో న్యూజిలాండ్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

More Telugu News