nama nageswar rao: టీడీపీకి గుడ్ బై చెప్పనున్న నామా నాగేశ్వరరావు?

  • కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నామా
  • ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ
  • టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరు
టీటీడీపీలో కీలక నేత నామా నాగేశ్వరరావు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మం సీటును నామాకు కాంగ్రెస్ ఖరారు చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ నేతలు తనతో సంప్రదించినట్టు నామా ధ్రువీకరించారు.

మరోవైపు, అమరావతిలో నిన్న జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి నామా హాజరు కాలేదు. దీంతో, ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. మరోవైపు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మీడియాతో మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును నామా కలిసి వెళ్లారని చెప్పారు.
nama nageswar rao
Telugudesam
congress
khammam

More Telugu News