Yuvaraj Singh: కాస్త స్పీడ్ పెంచవయ్యా బాబూ.. తనపై తానే యువరాజ్ సింగ్ సెటైర్!

  • ఫామ్ లో ఉన్న సమయంలో యువీ దూకుడు
  • ఇప్పుడు నిలకడలేమితో ఇబ్బందులు
  • తన ప్రాక్టీస్ వీడియోపై ఫన్నీ కామెంట్
ఫామ్ లో ఉన్న సమయంలో తన దూకుడుతో ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసిన డ్యాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ ఇప్పుడు నిలకడలేక, జట్టులో స్థానం కోసం ఇబ్బందులు పడుతున్నాడన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో కనీస ధరకు ముంబై ఇండియన్స్ జట్టుకు అమ్ముడై, మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడుతున్న యువరాజ్, తనపై తానే ఓ సెటైర్ వేసుకోగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

ప్రస్తుతం యూవీ, ముంబై ఇండియన్ తరఫున బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, ఆ వీడియోను జట్టు మేనేజ్ మెంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనిలో యువరాజ్ బ్యాట్ పట్టుకుని చాలా నిదానంగా నడుస్తున్నాడు. ఈ వీడియోపై స్పందించిన యువరాజ్, "అన్నగారూ... కాస్త వేగంగా నడవండి" అని కామెంట్ పెట్టాడు. కాగా, మరో వారంలో ఐపీఎల్ 12వ సీజన్ పోటీలు, చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి పోటీతో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
Yuvaraj Singh
Mumbai Indians
Twitter
Practice

More Telugu News