తమిళనాడు డిప్యూటీ స్పీకర్ తనయుడిపై ఆరోపణలు చేస్తున్నారంటూ.. డీఎంకే చీఫ్ స్టాలిన్ అల్లుడిపై కేసు!
- ఫేస్‌బుక్ స్నేహం పేరుతో అమ్మాయిలకు వల
- యువతి ఇచ్చిన ఫిర్యాదుతో గుట్టు రట్టు
- ముఠా చేతిలో 200 మంది యువతులు
ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసులో అన్నాడీఎంకే పొల్లాచ్చి శాఖ యువ నాయకుడు నాగరాజన్ ప్రధాన నిందితుడిగా తేలడంతో పార్టీ అతడిని వెంటనే సస్పెండ్ చేసింది. కాగా ఈ కేసు విషయంలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడు శబరీశన్.. తన కుమారుడి పేరును ప్రస్తావిస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు తమిళనాడు డిప్యూటీ స్పీకర్ వి.విజయరామన్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శబరీశన్‌పై కేసు నమోదు చేశారు.