Manchu Vishnu: మొదటగా మనం మార్చాల్సింది మన దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్ని: ‘ఓటర్’ టీజర్

  • నిర్మాతగా వ్యవహరిస్తున్న జాన్ సుధీర్ 
  • జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది
  • మంచు విష్ణు, సురభి జంటగా నటిస్తున్నారు
జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓటర్’. రామా రీల్స్ బ్యానర్‌పై జాన్ సుధీర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు సరసన సురభి కథానాయికగా నటించింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను నేడు చిత్రబృందం విడుదల చేసింది. ఓ యాక్షన్ సన్నివేశంతో ఈ టీజర్ మొదలవుతుంది.

‘అహింస మార్గం ద్వారా ఒక్క బుల్లెట్‌ కూడా కాల్చకుండా స్వాతంత్ర్యం తెచ్చుకున్న దేశం మనది. మనం పేదరికంపై పోరాటం చేశాం కానీ, పేదలపై పోరాటం చేయలేదు. మార్పు మనలో రావాలి’ అని మంచు విష్ణు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ‘నేను ఆఫ్ట్రాల్ ఓటర్‌ని కాదు.. ఓనర్‌’ అని విష్ణు చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది‌. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సంపత్ రాజ్ నటించారు.
Manchu Vishnu
Surabhi
John Sudheer
GS Karthik
Teaser
Sampath Raj

More Telugu News