Telugudesam: మరికాసేపట్లో టీడీపీ తొలి జాబితా విడుదల

  • 120-140 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు
  • 14-17 మంది లోక్‌సభ అభ్యర్థుల పేర్లు
  • కొత్తవాళ్ల పేర్లను కూడా పరిశీలిస్తున్న చంద్రబాబు
టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్ఠానం మరికాసేపట్లో విడుదల చేయనుంది. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చ జరిపిన అనంతరం.. మంత్రులు, పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. తొలి జాబితాలో 120 నుంచి 140 మంది అసెంబ్లీ అభ్యర్థులతో పాటు 14 నుంచి 17 మంది లోక్‌సభ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు కొత్తవాళ్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో పూర్తి జాబితాను చంద్రబాబు విడుదల చేయనున్నట్టు సమాచారం.
Telugudesam
Chandrababu
Polit Bearou
Loksabha
Assembly

More Telugu News