sensex: ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి జారుకున్న సూచీలు
  • చివరి వరకు ఒడిదుడుకులు
  • 3 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుని, అనంతరం ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 3 పాయింట్ల స్వల్ప లాభంతో 37,755కి చేరుకుంది. నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 11,343 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.53%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.84%), సన్ ఫార్మా (2.41%), యస్ బ్యాంక్ (2.25%), కోల్ ఇండియా (2.03%).

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.11%), హీరో మోటో కార్ప్ (-1.81%), టాటా మోటార్స్ (-1.05%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.01%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.66%).           

More Telugu News