Andhra Pradesh: వైసీపీ నుంచి మా ఫ్యామిలీకి ఫోన్లు వస్తున్నాయ్.. ఈరోజు సాయంత్రం కార్యాచరణ ప్రకటిస్తా!: రాయపాటి సాంబశివరావు

  • నరసరావుపేట టికెట్ ఇచ్చేందుకు టీడీపీ నో
  • హైకమాండ్ పై అలిగిన రాయపాటి
  • వైసీపీ నేతలతో ఫోన్ల ద్వారా చర్చలు
నరసరావుపేట లోక్ సభ టికెట్ విషయంలో హైకమాండ్ నో చెప్పడంతో టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన గుంటూరులోని స్వగృహంలో తన అనుచరులు, మద్దతుదారులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నరసరావుపేట లోక్ సభ స్థానానికి పోటీచేసేందుకు తనకంటే సమర్థులైన అభ్యర్థులు ఎవరు ఉన్నారని ప్రశ్నించారు.

తనకంటే సమర్థులు ఉంటే పార్టీ హైకమాండ్ వారికే టికెట్ ఇచ్చుకోవచ్చని స్పష్టం చేశారు. ఈసారి నరసరావుపేట టికెట్ తనకు ఇస్తే మరోసారి పోటీచేస్తానని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు తమ కుటుంబ సభ్యులతో ఫోన్ల ద్వారా చర్చలు జరుపుతున్నారని రాయపాటి బాంబు పేల్చారు. నరసరావుపేట టికెట్ విషయంలో ఈరోజు సాయంత్రంలోగా టీడీపీ అధిష్ఠానం చర్యలు తీసుకోకుంటే తన కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
Andhra Pradesh
rayapati
YSRCP
narasaraopeta
Telugudesam

More Telugu News