YSRCP: అభ్యర్థుల జాబితా విడుదల వాయిదాపై క్లారిటీ ఇచ్చిన జగన్‌

  • పార్టీ ముఖ్యనాయకులతో ఈరోజు సమావేశం
  • పార్టీలో చేరబోయే వారింకా ఉన్నారని వెల్లడి
  • అందుకే జాబితా పెండింగ్‌లో పెట్టినట్లు వివరణ
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితా విడుదల వాయిదాపై పార్టీ అధినేత జగన్‌ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఆయన పార్టీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శిల్పామోహన్‌రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయని, ఇంకా పార్టీలోకి వచ్చే వారు ఉన్నారని వివరించారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే జాబితాను చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వచ్చిందని నాయకులకు వివరించి చెప్పినట్లు సమాచారం. ఇంకా కొన్ని నియోజకవర్గాలపై కసరత్తు పూర్తికాలేదని, అన్ని అంశాలను పూర్తిచేసి ఈనెల 16వ తేదీన జాబితా విడుదల చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినట్లు తెలిసింది.
YSRCP
asembly candidates list
Jagan

More Telugu News