Rajamouli: రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్... అజయ్ దేవగణ్ కూడా ఉన్నారు: రాజమౌళి

  • యువ కొమరం భీమ్ గా ఎన్టీఆర్
  • అల్లూరి యువకుడి పాత్రలో కనిపించనున్న రామ్ చరణ్
  • ఈ సినిమా చేసే అవకాశం తన అదృష్టమన్న రాజమౌళి
'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తోందని, ఇదే సినిమాలో అజయ్ దేవగణ్ చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. ఈ ఉదయం సినిమాకు సంబంధించిన వివరాలను తొలిసారిగా వెల్లడిస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమౌళి మాట్లాడారు.

అల్లూరి సీతారామరాజు విప్లవ యోధునిగా మారకముందు పాత్రను చరణ్ పోషిస్తుండగా, ఎవరికీ తెలియని కొమరం భీమ్ చిన్న వయసు పాత్రను తారక్ పోషిస్తున్నాడని రాజమౌళి తెలిపారు. వీరిద్దరూ ఈ సినిమాలో తమ క్యారెక్టర్లలో ఒదిగిపోయారని కొనియాడిన రాజమౌళి, ఈ సినిమాను చేసే అవకాశం దక్కడం తనకు లభించిన అదృష్టమని అన్నారు.
Rajamouli
Ramcharan
NTR
RRR

More Telugu News