nara lokesh: అది దొంగబ్బాయి పెంచుకున్న మాయ పక్షి: నారా లోకేష్

  • సాక్షి మీడియాపై మండిపడ్డ లోకేష్
  • సాక్షి రాతలకు మనస్సాక్షి ఉండదు
  • దేనికైనా మసిపూసి మారేడుకాయ చేస్తుంది
వైసీపీ అధినేత జగన్, సాక్షి మీడియాపై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. 'సాక్షి రాతలకు ఉండదు మనస్సాక్షి. అది దొంగబ్బాయి పెంచుకున్న మాయ పక్షి. దేనికైనా మసి పూసి మారేడుకాయ చేస్తుంది. జరిగింది జరగనట్టు, జరగనిది జరిగినట్టు చెబుతుంది' అంటూ ట్వీట్ చేశారు.
లక్షల కోట్ల అక్రమార్జన కోసం క్విడ్ ప్రోకోను కనిపెట్టిన జగన్ గారు... ఇప్పుడు ఆ కేసుల నుంచి బయటపడటానికి ప్రధాని మోదీతో పొలిటికల్ క్విడ్ ప్రోకోకు దిగారు. టైమ్స్ నౌ కలువకుంట కుట్రలిప్పేసింది అంటూ మరో ట్వీట్ చేశారు.
nara lokesh
jagan
sakshi
Telugudesam
ysrcp

More Telugu News