Plat form: రైల్వే ట్రాక్ పై పడిన రూ.2000 నోటు.. అమాంతం దూకేసిన మహిళ!

  • ప్లాట్‌ఫాంపై ఉండగా పొరపాటున చేజారిన నోటు
  • ట్రాక్‌పైకి దూకగానే రైలు వచ్చేసింది
  • కొద్దిపాటి స్థలంలో నిలబడిపోయింది
రూ.2000 నోటు కోసం ఒకవైపు రైలు వస్తుండగానే ట్రాక్‌ పైకి దూకేసింది. కానీ ప్లాట్‌ఫాం పైకి ఎక్కే సమయం లేదు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ట్రాక్ పక్కన ఉన్న కొంచెం ఖాళీ స్థలంలో నిలబడిపోయింది. ఢిల్లీలోని ద్వారకా మోర్ మెట్రో స్టేషన్‌లో మంగళవారం రైలు ఎక్కేందుకు ఒక మహిళ వచ్చింది. తాను ప్లాట్‌ఫాంపై ఉండగా తన వద్దనున్న రూ.2000 నోటు పొరపాటున చేజారి ట్రాక్‌పై పడిపోయింది.

ఒకపక్క రైలు వస్తున్నా.. నోటు తీసుకుని తిరిగి రాగలననే ధీమాతో ట్రాక్‌పైకి దూకేసింది. కానీ అంతలోనే ట్రైన్ స్టేషన్‌లోకి రానే వచ్చింది. దీంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ట్రాక్ పక్కనున్న కొద్దిపాటి స్థలంలో నిలుచుండి పోయింది. చిన్నపాటి గాయాలతో బయటపడిన ఆమెను మెట్రో అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె కాస్త కోలుకున్నాక తన కారణంగా సీఐఎస్ఎఫ్ సేవలకు భంగం వాటిల్లినందుకు రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పింది.
Plat form
2000 Note
Delhi
Metro Station
CISF

More Telugu News