Andhra Pradesh: నిజమే.. గంటా శ్రీనివాసరావు ముఖంలో అలక చూడండి.. సాక్షి టీవీపై లోకేశ్ సెటైర్లు!

  • టీడీపీ అధిష్ఠానంపై గంటా అలిగారని కథనాలు
  • ఫన్నీగా స్పందించిన ఏపీ మంత్రి
  • అవినీతి డబ్బా-అవినీతి పత్రిక అని విమర్శలు
ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ అధిష్ఠానంపై అలిగినట్లు సాక్షి మీడియా సంస్థలో కథనాలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ లో వ్యంగ్యంగా స్పందించారు.

సాక్షి టీవీ ముందు గంటాతో కలిసి నవ్వుతూ ఫొటో దిగిన లోకేశ్..‘అవును నిజమే! గంటా శ్రీనివాసరావు గారి ముఖంలో అలక చూడండి! Yea right! Look how unhappy @Ganta_Srinivasa is! అవినీతి డబ్బా ... అవినీతి పత్రిక’ అని ట్వీట్ చేశారు. దీనికి   #FakeNewsSaakshi  #FakeTV  #Fakeleader అనే హ్యాష్ ట్యాగ్ లను జతచేశారు.
Andhra Pradesh
Telugudesam
Ganta Srinivasa Rao
Nara Lokesh
YSRCP
sakshi channel
Twitter

More Telugu News