Andhra Pradesh: అవినీతి, కుమ్మక్కు రాజకీయాలపై జగన్ కు పేటెంట్ హక్కు ఉంది!: సాధినేని యామిని

  • తొమ్మిదేళ్ల వైసీపీ చరిత్రలో ఒక్క మంచిపని కూడా చేయలేదు
  • జగన్ కింగ్ ఆఫ్ డేటా చోరీగా మారారు
  • విజయవాడలో మీడియాతో టీడీపీ నేత

కుమ్మక్కు రాజకీయాలపైన, అవినీతిపైన వైసీపీ అధినేత జగన్ కు పేటెంట్ హక్కు ఉందని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని సెటైర్ వేశారు. వైసీపీ ఆవిర్భవించి 9 సంవత్సరాలు గడిచినప్పటికీ.. ఆ పార్టీ చరిత్రలో ఇప్పటివరకూ ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. జగన్ కింగ్ ఆఫ్ కరప్షన్, కింగ్ ఆఫ్ డేటాచోరీగా మారారని ఎద్దేవా చేశారు. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తో కలిసి యామిని ఈరోజు మీడియాతో మాట్లాడారు.

ఎలాంటి ఛాన్స్ ఇవ్వకపోయినా జగన్ ఇప్పటికే రూ.లక్ష కోట్లు కొట్టేశారని యామిని ఆరోపించారు. ఇప్పుడు ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తే అడంగళ్ లో పేర్లు మార్చి ప్రజల ఆస్తులను సైతం లాక్కుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాతీర్పుతో వైసీపీ ఫ్యాన్ బంగాళాఖాతంలో కాకుండా ఆరేబియా సముద్రంలో పడిపోతుందని సెటైర్లు వేశారు.

  • Loading...

More Telugu News